Corona Virus: ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు

Aug 8 2021 5:46 PM | Updated on Aug 10 2021 5:33 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,531 కు చేరింది. 

గత 24 గంటల్లో 2,458 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,48,828 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 19,949 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు  2,51,93,429 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement