Corona Virus: ఏపీలో కొత్తగా 2,442 కేసులు.. | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 2,442 కేసులు..

Aug 4 2021 5:20 PM | Updated on Aug 6 2021 4:57 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,442 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,444 కు చేరింది. 

గడిచిన 24 గంటల్లో 2,412 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,40,368 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,184 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,73,996 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు  2,48,63,968 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement