చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు: గౌతమ్‌రెడ్డి | AP FiberNet Chairman Gowtham Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు: గౌతమ్‌రెడ్డి

Sep 13 2021 12:48 PM | Updated on Sep 13 2021 3:00 PM

AP FiberNet Chairman Gowtham Reddy Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్‌ కట్టబెట్టారన్నారు.

సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్‌ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్‌ ఉన్నా.. రెండు నెలల్లోనే టెండర్‌ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్‌కు టెండర్‌ కేటాయించేందుకే కాల పరిమితి పొడిగించారన్నారు.

చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్‌లో రాజీనామా చేయించి ఫైబర్‌నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారన్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింది. దర్యాప్తు  పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు.

ఇవీ చదవండి:
టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు  
చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement