కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

Published Tue, Apr 5 2022 9:42 PM

AP CM YS Jagan Meets Union Home Minister Amit Shah - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్‌ మంగళవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో గంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు

పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాల పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్‌ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చించారు. 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిర్మాణం, డిజైన్ల ఆమోదంపై చర్చించారు. కాఫర్‌ డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ డిజైన్లకు ఇప్పటికే జలశక్తిశాఖ ఆమోదం తెలిపింది.

Advertisement
Advertisement