AP Cabinet Meeting Chaired By CM YS Jagan: Updates - Sakshi
Sakshi News home page

కేబినెట్‌ భేటీలో జగనన్న సురక్ష ప్రస్తావన.. అద్భుతమన్న సీఎం జగన్‌

Jul 12 2023 10:53 AM | Updated on Jul 12 2023 5:25 PM

Ap Cabinet Meeting Chaired By Cm Jagan Updates - Sakshi

 సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్ష­తన బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం కానుంది.

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మం­దిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మూడున్నర గంటలపాటు 55 అంశాలపై ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. అలాగే.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు రాష్ట కేబినెట్‌ చేసింది. అలాగే.. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు రాగా.. అద్భుతమైన ఫలితాలపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు’’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement