breaking news
cabinet ministers meeting
-
జగనన్న సురక్షతో అద్భుతమైన ఫలితాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాకులోని కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మూడున్నర గంటలపాటు 55 అంశాలపై ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. అలాగే.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు రాష్ట కేబినెట్ చేసింది. అలాగే.. అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రాగా.. అద్భుతమైన ఫలితాలపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు’’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
కొత్త మంత్రి వర్గంపై అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఏపీ కేబినెట్ విజయవాడలో సమావేశం కానుంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో వర్షాల కారణంగా విజృంభిస్తున్న విష జర్వాలు, స్విస్ ఛాలెంజ్ విధానం కేసు విచారణలో ఎదురవుతున్న విమర్శలతోపాటు వెలగపూడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది.