నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ | ap cabinet ministers meeting at vijayawada | Sakshi
Sakshi News home page

నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ

Sep 22 2016 9:47 AM | Updated on Jul 28 2018 3:33 PM

నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ - Sakshi

నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ విజయవాడలో సమావేశం కానుంది.

విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఏపీ కేబినెట్ విజయవాడలో సమావేశం కానుంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు.

అలాగే రాష్ట్రంలో వర్షాల కారణంగా విజృంభిస్తున్న విష జర్వాలు, స్విస్ ఛాలెంజ్ విధానం కేసు విచారణలో ఎదురవుతున్న విమర్శలతోపాటు వెలగపూడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement