రాజధానిలో మరో భూ మోసం | Another land scam in the capital | Sakshi
Sakshi News home page

రాజధానిలో మరో భూ మోసం

Oct 8 2026 4:37 AM | Updated on Oct 8 2026 4:37 AM

Another land scam in the capital

తాను భూమి అమ్మినట్లు అగ్రిమెంట్‌ సృష్టించారని పెదపరిమి రైతు మల్లేశ్వరరావు ఆవేదన 

దీనివెనుక టీడీపీ నేతలున్నారు

తాడికొండ: అమరావతి రాజధానిలో మరో భూ మోసం వెలుగు చూసింది. ఇటీవల బతికున్న మనిషిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి తాడికొండకు చెందిన హనుమంతు సుబ్రహ్మణ్యశాస్త్రికి చెందిన పదెకరాల భూమికి ఆన్‌లైన్‌లో పేరు మార్చిన కేసులో తహసీల్దార్, ఆర్‌ఐ, ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురైనా నిందితుడు ఎవరో తేలకముందే రాజధాని ప్రాంతమైన తాడికొండ మండలం పెదపరిమిలో మరో భూ మోసం వెలుగు చూసింది. పెదపరిమికి చెందిన బాధిత రైతు నర్రా మల్లేశ్వరరావు బుధవారం తాడికొండలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. 

రూ.4 కోట్ల విలువైన తన 89 సెంట్ల భూమిని తమ గ్రామంలో టీడీపీకి చెందిన భాష్యం సురేష్‌చౌదరి రూ.1 కోటి 11 లక్షల 25 వేలకు కొనుగోలు చేసినట్లు ఈ ఏడాది జూన్‌ రెండోతేదీ అగ్రిమెంట్‌ సృష్టించారని మల్లేశ్వరరావు చెప్పారు. 60 రోజుల అనంతరం తాను రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ సురేష్‌ కోర్టు నోటీసులిచ్చారని తెలిపారు. అసలు అమ్మకం, కొనుగోలు జరగనప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని సురేష్‌ బాబాయిని తాను అడిగినట్లు తెలిపారు. సురేష్‌ బాబాయి లాయర్‌కి ఫోన్‌చేసి కొనుగోలు చేయకుండా ఇలా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే లాయరు సమాధానం చెప్పలేదన్నారు. సురేష్‌ తనకు తెలియదని, తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. 

తన ఆస్తి కాజేయాలన్న ఈ కుట్ర వెనుక తమ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు, భాష్యం హనుమయ్య, గార్లపాడుకు చెందిన ఘట్టమనేని వాసు, పుట్టి హనుమంతరావు ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని చీటింగ్‌ కేసు నమోదు చేయమని సెపె్టంబర్‌ 21న జిల్లా ఎస్పీని కోరితే తుళ్ళూ­రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సూచించారని తెలిపారు. తుళ్లూరు డీఎస్పీ, సీఐలను కలవగా సివిల్‌ కేసు అంటూ కేసు నమోదు చేయకుండా పక్కన పడేశారని ఆరోపించారు. తన భూమి వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు, ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు పంపానన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement