‘టీడీపీ దాడులు.. ప్రాణాల్ని అడ్డేసి కార్యకర్తల్ని కాపాడుకుంటాం’ | Annamayya District YSRCP Chief On TDP Goons Attacks | Sakshi
Sakshi News home page

‘టీడీపీ దాడులు.. ప్రాణాల్ని అడ్డేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం’

Published Fri, Jun 21 2024 9:09 AM | Last Updated on Fri, Jun 21 2024 10:41 AM

Annamayya District YSRCP Chief On TDP Goons Attacks

అన్నమయ్య, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా కిరాయి గుండాలు దాడులకు పాల్పడి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా తోడుగా నిలబడాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అందుకే ప్రాణాల్ని అడ్డుపెట్టి అయినా కార్యకర్తల్ని కాపాడుకుంటాం అని అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

రాయచోటిలో టీడీపీ నాయకుల చేతిలో కత్తిపోట్లకు గురై అసుపత్రిలై చికిత్స పోందుతున్న వాళ్లకు శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కౌన్సిలర్లపై వారి ఆస్తులపై దాడులు జరగడం దురదృష్టకరం. తమ పాలనలో జిల్లా కేంద్రం చేసి శాంతిభద్రతలు పరీక్షించం. అదనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కార్యాలయం ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశాం.  

రాష్ట్రవ్యాప్తంగా కిరాయి గుండాలు దాడులకు పాల్పడి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా తోడుగా నిలబడాలని వైఎస్‌ జగన్‌ మా అందరికీ సూచించారు. మా ప్రాణాలు అడ్డుపెట్టి కార్యకర్తలను కాపాడుకుంటాం. 

.. కిరాయి గుండాలతో దాడులు చేయించి, హీరోయిజంగా ఫీల్ అవ్వడం రాక్షసత్వం. గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కత్తులు కట్టెలు, బండలతో చేస్తున్న వికృత చేష్టలు సిగ్గుపడేలా ఉన్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఏనాడూ ప్రోత్సహించలేదు. తిరిగి దాడులు చేయడం మా సంస్కృతి కాదు. టీడీపీ దాడులను ఐక్యమత్యంతో తిప్పి కొడతాం అని అన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement