అంగన్‌వాడీలు ఉద్యమానికి సిద్ధం కండి | Anganwadi workers to protest at collectorates on the 10th of next month | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలు ఉద్యమానికి సిద్ధం కండి

Jun 15 2026 2:45 AM | Updated on Jun 15 2026 2:45 AM

Anganwadi workers to protest at collectorates on the 10th of next month

వచ్చే నెల 10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను జయప్రదం చేయండి  

అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు  

కనీస వేతనాలు ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ 

సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్ల సాధన కో­సం అంగన్‌వాడీలు ఉద్యమానికి సిద్ధం కావా­లని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. జూలై 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడలో ఆ­దివారం యూనియన్‌ అధ్యక్షురాలు జి.బేబీరాణి అధ్యక్షతన అంగన్‌వాడీల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. అనంతరం సుబ్బరావమ్మ మీడి­యా­­­తో మాట్లాడుతూ..అంగన్‌వాడీలకు కనీస వే­త­నమివ్వాలని, పెన్షన్, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వం ఐసీడీఎస్‌కు నిధులు తగ్గించి లబ్ధిదారులకు ఫీడింగ్‌ స­క్రమంగా అందకుండా చేస్తోందన్నారు. అనేక ర­కా­ల యాప్‌లు తీసుకొచ్చి అంగన్‌వాడీలపై పనిభా­రం పెంచి ప్రీసూ్కల్‌ జరగనివ్వకుండా చేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధర­లు ఏడాదికి 10 శాతానికి పైగా పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం అంగన్‌వాడీలకు కనీస వేత­నాలు ఇవ్వడం లేదన్నారు. బాబు ప్రభుత్వం పె­ట్టు­బడిదారులకు రూ.లక్షల కోట్లు రా­యి­తీలు ఇ­స్తోందని, పారిశ్రామికవేత్తలకు 99పైసలకే భూములను ధారాదత్తం చేస్తోందని, అంగన్‌వాడీల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement