విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్‌ ఆధీనంలో! | Andhra Pradesh under private control: User charges to be collected for all social services | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్‌ ఆధీనంలో!

Aug 11 2026 5:10 AM | Updated on Aug 11 2026 5:10 AM

Andhra Pradesh under private control: User charges to be collected for all social services

సామాజిక సేవలన్నింటికీ యూజర్‌ చార్జీలు వసూలు

సామాజిక రంగ ప్రాజెక్టులన్నీ ఇక పీపీపీలోనే.. ప్రైవేట్‌ సంస్ధలకు వీజీఎఫ్‌తో పాటు వడ్డీ లేని రుణాలు 

మెడికల్‌ కాలేజీలకు వీజీఎఫ్‌తో పాటు రాయితీపై భూమి 

ప్రైవేట్‌ సంస్థకు 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా 

పీపీపీ విధానం–2026 ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభు­త్వం సామాజిక బాధ్యతల నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్‌ సంస్ధలకు అప్పగించేసింది! ప్రజలకు కనీస సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అంది­ంచాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సేవ­లను పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో ప్రైవేట్‌ పరం చేస్తోంది. దీంతో విద్య, వైద్యం, తాగునీరు, రవాణా లాంటి సామాజిక సేవ­లకు ప్ర­జల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేయను­న్నారు. ఫలితంగా ఈ సేవలు ఖరీదు కాను­న్నాయి. అంతేకాకుండా పీపీపీ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్‌ సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీలేని రుణాలను ఇవ్వనుంది.

వడ్డీ లేని రుణాలకు ‘వయబులిటీ బ్రిడ్జ్‌ ఫండ్‌’ అనే పేరు పెట్టింది. వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ అసలు మాత్రమే ఆయా సంస్ధల నుంచి తిరిగి రికవరీ చేస్తుంది. దీంతో పాటు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) పేరుతో నిధులు సమకూర్చనుంది. ఇందుకోసం బడ్టెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకం కానివి, భవిష్యత్‌లో ఆదాయాన్ని సమకూర్చే ప్రాజెక్టులకు వయబులిటీ బ్రిడ్జ్‌ ఫండ్‌ కింద వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందిస్తుంది.  

పొదుపుగా సేవల వినియోగం..! 
ప్రైవేట్‌ సంస్థలు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని రూపొందించింది. మెడికల్‌ కాలేజీలకు వీజీఎఫ్‌తో పాటు రాయితీపై భూమి ఇస్తారు. ఇందుకోసం ‘పీపీపీ విధానం 2026’ పేరుతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్‌ సంస్ధలు వెచి్చంచిన వ్య­యాన్ని వినియోగదారుల నుంచి యూజర్‌ చార్జీల రూపంలో కచ్చితంగా రాబట్టనున్నట్లు పీపీపీ విధానంలో స్పష్టం చేశారు. పీపీపీ విజయవంతమయ్యేందుకు వినియోగదారుడే చార్జీలు చెల్లించాలనేది కీలకమైన సూత్రమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది పొదుపుగా సేవలను వినియోగించుకునేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.  

వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ.. 
వాణిజ్యపరంగా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన చోటల్లా యూజర్‌ చార్జీల విధింపును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. చార్జీల నియంత్రణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. పీపీపీ ప్రాజెక్టుల్లో ప్రైవేట్‌ రంగం చేసిన వ్యయాన్ని రాబట్టేందుకు తరచూ చార్జీల సవరణ ప్రాతిపదికన వీటిని రూపొందించనున్నారు. పీపీపీలో ప్రైవేట్‌ సంస్థకు 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, స్వయం ప్రతిపత్తి గల సంస్ధలు ఐదేళ్ల పాటు పీపీపీ ప్రాజెక్టులను రూపొందించాలి. రెండో సారి సింగిల్‌ బిడ్‌ వస్తే అదే సంస్థకు ప్రాజెక్టు ఖరారు చేస్తారు. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ తక్కువ కోట్‌ చేయడమే ప్రాతిపదికగా సంస్ధలను ఖరారు చేస్తారు. సామాజిక రంగ ప్రాజెక్టులు ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో 40 శాతం మూలధన గ్రాంటుకు అర్హత కలిగి ఉంటాయి. వీజీఎఫ్‌ కింద అర్హత పొందిన ప్రాజెక్టుల్లో 100 శాతం నిర్వహణ వ్యయం వసూలు చేయాలని నిర్దేశించారు. 

ప్రభుత్వ పాత్ర ఇలా.. 
ప్రాజెక్ట్‌ అవసరాన్ని గుర్తించి పీపీపీ లక్ష్యాలు, ఉద్దేశాలను నిర్ధారించి ప్రాధాన్యత ఇవ్వడం. పీపీపీ ఎంపికను ఆమోదించి సిఫార్సులు చేయడం. ప్రాజెక్టు అమలును సులభతరం చేయడంతో పాటు భూసేకర­ణ, యుటిలిటీల తరలింపు లాంటి సహాయ చర్యలు. పారదర్శకమైన పోటీతో కూడిన బిడ్డింగ్‌ ప్రక్రియను నిర్వహించడం. నిర్మాణం, నిర్వహణ సమ­యంలో పర్యవేక్షించడంతో పాటు రాయితీ కాలం ముగిసిన తర్వాత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం.  

ప్రైవేట్‌ రంగం పాత్ర ఇలా.. 
పీపీపీ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అందించడం. పోటీ బిడ్డింగ్‌ విధానాలను అనుసరించడం. రాయితీ ఒప్పందాన్ని ఖచి్చతంగా పాటించడం. రా­యితీ కాలం ముగిసిన తర్వాత ఒప్పందం ప్రకారం ఆస్తిని బదిలీ చేయడం.

పీపీపీ రంగం ప్రాజెక్టులు ఇలా..
 వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉద్యానవన మార్కెట్లు, పూల పెంపకం పార్కులు, మా­ర్కెట్లు, ఉద్యానవన–ఆహార శుద్ధి అను­బంధ మౌలిక సదుపాయాలు (శీతల గిడ్డంగుల­తో సహా) టెరి్మనల్‌ నిల్వ, పంట కోతల అనంతర నిల్వ, లాజిస్టిక్స్‌ పార్కులు, గిడ్డంగులు. 
విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఈ–గ్రంథాలయాలు. 
విద్యుత్‌ ఉత్పత్తి (క్యాప్టివ్‌తో సహా), ప్రసారం, పంపిణీ, వర్తకం, గ్యాస్, పునరుత్పాదక, సంప్రదాయేతర శక్తి, ఈవీ చార్జింగ్, బ్యాటరీ మార్పిడి, స్మార్ట్‌ గ్రిడ్‌లు  

ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్, రోగ నిర్ధారణ, గుండె జబ్బుల కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వైద్య విద్య మౌలిక సదుపాయాలు, ప్రమాద సహాయక కేంద్రాలు, పునరావాస, శిక్షణ  కేంద్రాలు. 
⇒  పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: పారిశ్రామిక పార్కులు 

 నీటిపారుదల: ఆనకట్టలు, కాలువలు, అనుబంధ పనులు 
ప్రజా మార్కెట్లు, భవనాలు: మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు. 
 వినోద, విహార, థీమ్‌ పార్కులు: హోటళ్లు/రిసార్టులు, సమావేశ కేంద్రాలు, లైట్‌–అండ్‌–సౌండ్‌ షోలు, సాంస్కృతిక కేంద్రాలు, వన్యప్రాణి పర్యాటకం, మ్యూజియంలు, సాహస క్రీడల మౌలిక సదుపాయాలు. 

 రోడ్లు, రోప్‌వేలు, అంతర్గత జల రవాణా, ఓడరేవులు, అంతర్గత ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్‌లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్‌ హబ్‌లు, రైల్వే, పట్టణ రవాణా వ్యవస్థలు, బస్‌/ట్రక్‌ టెరి్మనళ్లు, గిడ్డంగులు, పార్కింగ్‌ సౌకర్యాలు. 
 టౌన్‌íÙప్‌ల అభివృద్ధి: ఘన, బయో–మెడికల్, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పట్టణ నీటి సరఫరా. 
కళలు, సాంస్కృతిక థియేటర్లు, క్రీడా స్టేడియంలు, హాస్టళ్లు/క్వార్టర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలు, వ్యాయామశాలలు. 

తక్కువ ధర గృహాలు, అందుబాటు ధరల గృహాలు, కారి్మకుల అద్దె గృహాలు. 
  గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, చిన్న బహుళార్ధ సాధక జలాశయాలు, గ్రామీణ పర్యాటకం, గ్రామీణ మార్కెట్లు, గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు. 

టెలికమ్యూనికేషన్‌ 
నీరు, పారిశుధ్యం: నీటి సరఫరా, శుద్ధి ప్లాంట్లు, మురుగునీటి సేకరణ, 
 ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు

 పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: పారిశ్రామిక పార్కులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement