రోడ్డు విస్తరణ చేయడం తప్పా!

Andhra Pradesh High Court deposed TDP leader - Sakshi

టీడీపీ నేతను నిలదీసిన హైకోర్టు

పనుల నిలుపుదలకు నిరాకరణ

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డు విస్తరణను అడ్డుకునే దిశగా తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తు తం ఉన్న డివైడర్‌ను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టడం వల్ల వచ్చిన నష్టం ఏమిటంటూ టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావును నిలదీసింది. రోడ్డును విస్తరిస్తే ప్రజా ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయని ప్రశ్నించింది. అభివృద్ధిలో భా గంగా రోడ్డు విస్తరణ కోసం చేస్తున్న పనులపై పి ల్‌ దాఖలు చేయడం ఏమిటని శ్రీనివాసరావుపై అసహనం వ్యక్తం చేసింది. రోడ్డు విస్తరణకు సం బంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల నిమిత్తం శ్రీనివాసరావు చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

ఈ వ్యాజ్యాన్ని విచా రణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధా న న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్న డివైడర్‌ను తొలగించి మంగళగిరి రోడ్డు విస్తరణను మునిసిపల్‌ నిధులతో చేపడుతున్నారంటూ టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఆర్‌ అండ్‌ బీ రోడ్డును మునిసిపల్‌ నిధులతో విస్తరిస్తున్నారని తెలిపారు.  ఈ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉన్న డివైడర్‌ను తీసేసి రోడ్డును విస్తరిస్తే నష్టం ఏముందని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనాలేవీ లేవంటూ విచారణను వాయిదా వేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top