సిగ్గుచేటు.. వరదల్లో జెండాలతో రాజకీయాలు చేస్తారా: మంత్రి అంబటి | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండాలతో చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నాడు: మంత్రి అంబటి

Published Sat, Jul 23 2022 2:20 PM

Ambati Rambabu Serious On TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు: వర్షాల నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌పై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. 

చంద్రబాబు పాలనలో వర్షాలు పడటం కానీ, గేట్లు ఎత్తడంగానీ జరగలేదు. వరద బాధితులు ఇబ్బందులు పడుతుంటే ,చంద్రబాబు మాత్రం పార్టీ జెండాలతో కార్యకర్తలతో రాజకీయాలు చేస్తున్నాడు. గోదావరి వరద బాధితులతో చంద్రబాబు టీడీపీ జెండాలతో వెళ్తారా? ఇది సిగ్గుచేటు కాదా?. సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. నదుల్లో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుతాయి. వరదలు ఈ ఏడాది చాలా ముందుగా వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం. 

కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా నిర్మిస్తారా?. కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాతే డయాఫ్రమ్ నిర్మించాలని నిపుణులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే పనులు వేగంగా పూర్తి చేస్తున్నాము. చంద్రబాబు అహంతోనే పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగింది’’ అని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ఎన్నిక; టీడీపీ డబుల్‌ గేమ్‌

Advertisement
Advertisement