COVID-19: Adimulapu Suresh Announced Holidays For Schools In AP - Sakshi
Sakshi News home page

1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి సెలవులు

Apr 19 2021 3:58 PM | Updated on Apr 19 2021 5:50 PM

Adimulapu Suresh: Holidays For 1 To 9th Classes From April 20 - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి(ఏప్రిల్‌20) సెలవులు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement