CM Jagan: సరదా సరదాగా క్రికెట్‌ ఆడితే.. | AADUDAM ANDHRA: CM Jagan Play Cricket Fun Moments | Sakshi
Sakshi News home page

సరదా సరదాగా క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌

Dec 26 2023 12:06 PM | Updated on Dec 26 2023 2:50 PM

AADUDAM ANDHRA: CM Jagan Play Cricket Fun Moments - Sakshi

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిత్యం వాటి సమీక్షలతో బిజీ బిజీగా గడిపే.. 

సాక్షి, గుంటూరు: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిత్యం వాటి సమీక్షలతో క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సరదాగా సందడి చేస్తే ఎలా ఉంటుంది?. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కోసం ఇవాళ గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణానికి వెళ్లిన ఆయన.. అక్కడ క్రికెట్‌ ఆడారు. 

కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మైదానంలోకి అడుగుపెట్టారాయన. అక్కడ తొలుత మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పిన సీఎం జగన్‌.. ఆ తర్వాత ఆయనే ‍స్వయంగా బ్యాట్‌ చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) ఛైర్మన్‌  బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి బౌలింగ్‌ చేయడం గమనార్హం. 

నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే సీఎం జగన్‌ను.. అలా చూసేసరికి తోటి మంత్రులు, అధికార యంత్రాగం సంబురంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఆ సమయంలో మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు పక్కనే ఉన్నారు. ఆపై కబడ్డీ, కోకో.. ఇలా పలు రంగాల క్రీడాకారుల్ని భుజం తట్టి ముందుకు వెళ్లారాయన.  కాసేపు బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ కోర్టుల్లోనూ సండి చేశారు.

👉: ఆడుదాం ఆంధ్రా పోటీల్లో బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌ (ఫొటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement