AP Covid Cases In Last 24 Hours: 2,567 New Positive Cases Recorded - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 2,567 కరోనా కేసులు

Jul 13 2021 5:07 PM | Updated on Jul 13 2021 5:24 PM

2567 New Corona Cases Recorded In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 81,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 2,567 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా  వైరస్‌ ప్రభావంతో 18 మంది మృతి చెందారు.  తాజాగా 3,034 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌  అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు  2,31,30,708 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,87,236 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,042 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,26,988 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement