Covid - 19 Update : 1,535 New Corona Positive Cases Recorded In AP Last 24 Hours - Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Aug 14 2021 3:53 PM | Updated on Aug 14 2021 6:26 PM

1535 New Corona Cases Recorded In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 1,535 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా  వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు.  తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌  అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,55,95,949  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,60,350 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement