తాడిపత్రి రూరల్ : పట్టణ సమీపంలోని అనంతపురం– బుగ్గ బైపాస్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాలగోపి (24) మృతి చెందాడు. ప్రమాదంలో అతని స్నేహితుడు కేవేంద్రతోపాటు భార్యాభర్తలు రాధిక, శివారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అప్‌గ్రేడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాలజిల్లా గోర్విమానిపల్లికి చెందిన నంద్యాలగోపి తల్లిదండ్రులు ఉపాధి కోసం తాడిపత్రికి వలస వచ్చి గన్నెవారిపల్లికాలనీలో నివాసం ఉంటున్నారు. బీటెక్ చదివిన నంద్యాలగోపి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని స్నేహితుడైన తమిళనాడుకు చెందిన కేవీంద్ర కుటుంబ సభ్యులు ఉపాధి కోసం తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డారు. వ్యక్తిగత పని నిమిత్తం నంద్యాలగోపి స్వగ్రామమైన గోర్విమానిపల్లికి స్నేహితుడు కేవీంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి ఆదివారం రాత్రి తాడిపత్రికి బయల్దేరారు. తాడిపత్రి మండలం వెలమకూరుకు చెందిన భార్యాభర్తలు రాధిక, శివారెడ్డి పని నిమిత్తం తాడిపత్రికి ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. నూతనంగా నిర్మించిన బైపాస్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నంద్యాలగోపీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. గోపి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భార్యాభర్తలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలు


