గుంతకల్లు: రైల్వే ఉద్యోగులు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుందని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. సోమవారం డీఆర్‌ఎం కార్యాలయంలోని తుంగభద్ర సమావేశ చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా గుంతకల్లు రైల్వే డివిజన్ ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను ప్రదానం చేశారు. రైల్వే ట్రాక్‌లు, సిగ్నిలింగ్, ఇతర భద్రతపరమైన అంశాల్లో తలెత్తే లోపాలను సకాలంలో గుర్తించి, ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన ఉద్యోగుల సేవలను డీఆర్‌ఎం ప్రశంసించారు. ఈ అవార్డులకు టెక్నీషియన్ల విభాగంలో ఆర్.విష్ణువర్ధన్‌రెడ్డి, పి.మారెప్ప, బీ.బాల నరసింహమూర్తి, సంజీవ్‌కుమార్ మీనా, ఎల్. కాంతమ్మ ఎంపికయ్యారు. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ విభాగంలో కేఎన్‌ఎస్‌ఎస్ శ్రవణ్, ట్రైన్ మేనేజర్ల విభాగంలో ఎ.ఇమ్రాన్, రామన్‌కుమార్ పాల్, ఎస్.నసీరుద్దీన్, పాయింట్స్‌మెన్ విభాగంలో కై లాస్‌కుమార్, గిరిబాబు, స్టేషన్ మాస్టర్ విభాగంలో రోహిత్‌కుమార్ మహావర్ మ్యాన్ అఫ్ ది మంత్ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శివప్రసాద్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.


