పెద్దవడుగూరు/ కూడేరు : జిల్లాలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్దవడుగూరు మండలం చిత్రచేడులోని 46వ పోలింగ్ బూత్‌లో 905 ఓట్లకు గాను 535 ఓట్లతో 58.34 శాతం పోలింగ్ నమోదైంది. 47వ పోలింగ్ బూత్‌లో 907 ఓట్లకు గాను 522 ఓట్లతో 57.55 పోలింగ్ జరిగినట్లు ఆర్‌ఓ వెంకటరమణనాయక్, తహసీల్దార్ ఉషారాణి తెలిపారు.
మరుట్ల–2లో 74 శాతం పోలింగ్
కూడేరు మండలం మరుట్ల–2వ కాలనీ 8వ బూత్‌లో శుక్రవారం రీ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉద్రిక్తతకు కారణమవుతారనే ఉద్దేశంతో సీఐ రాజును పోలింగ్ విధులకు దూరంగా ఉంచారు. 820 మందిలో 610 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ 74 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


