న్యూస్‌రీల్
అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు నూతనంగా 12 వైద్య పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎంఎస్ ఆర్థోకు నాలుగు, ఎండీ పెథాలజీకి నాలుగు, ఎండీ ఎమర్జెన్సీ మెడిసిన్‌కు నాలుగు సీట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సుశ్రుత హాలులో అభినందన సభ ఏర్పాటు చేసి, కేక్ కట్ చేశారు. కార్యక్రమానికి అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి అధ్యక్షత వహించారు. డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌గా విజయశ్రీ బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోపు ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం అనందంగా ఉందని డాక్టర్ మల్లీశ్వరి పేర్కొన్నారు. కార్యక్రమంలో అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు డాక్టర్ వి.శ్రీనివాసులు, ఎం.ఆత్మారాం, వి.శివశంకరనాయక్, ఎన్‌ఎంసీ టీమ్ సభ్యులు డాక్టర్ బి.ఆర్.శ్యామ్ ప్రసాద్, డాక్టర్ పద్మ శ్రావణి సాగి, డాక్టర్ ప్రవీణ్ దీన్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.


