జీజీహెచ్‌లో లక్ష్మీ శస్త్రచికిత్స విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో లక్ష్మీ శస్త్రచికిత్స విజయవంతం

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

అనంతపురం సిటీ: రాప్తాడులో ఉన్మాది హేమంత్‌ రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీకి అనంతపురం జీజీహెచ్‌ ఆర్థో విభాగం వైద్యులు సోమవారం శస్త్రచికిత్స చేశారు. రాప్తాడు పాఠశాల విద్యార్థిని గోపికపై హేమంత్‌ దాడి చేస్తున్న సమయంలో లక్ష్మీ ధైర్యంగా ఎదుర్కొన్న విషయం విదితమే. హేమంత్‌ దాడిని అడ్డుకునే క్రమంలో ఎలక్ట్రిక్‌ రంపం తగిలి లక్ష్మీ కాళ్లకు లోతైన గాయాలయ్యాయి. ఘటన అనంతరం జీజీహెచ్‌లో అడ్మిషన్‌లో ఉన్న లక్ష్మీకి సోమ వారం ఉదయం ఆర్థో విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బీఎండీ గౌస్‌ నేతృత్వంలో అనస్థీషియా డాక్టర్‌ మధుసూదన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగరాజు నాయక్‌, డాక్టర్‌ సౌజన్య, ఆర్థో, అనస్థీషియా విభాగం పీజీలు, ఓటీ సిబ్బంది దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బాలిక పాదంలో తెగిన నరాలు, బొటనవేలి సమీపంలో జాయింట్‌ను శస్త్రచికిత్సలో సరిచేశారు. ఆర్థో విభాగం వైద్యులను జీజీహెచ్‌ ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement