అనంతపురం అగ్రికల్చర్: కరువు తాండవం చేస్తున్న అనంతపురం జిల్లాకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో కరువు పరిస్థితుల పరిశీలనలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం టీం లీడర్ చిన్మయ్ గోట్మారా, ఇతర సభ్యులను సీపీఎం నాయకులు ఎస్.నాగేంద్రకుమార్, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.బాలరంగయ్య, రామాంజనేయులు, సంజీవరెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. వర్షాలు లేక లక్షలాది ఎకరాల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, పశుగ్రాసం లేక పశువులు, జీవాల పరిస్థితి, పండ్లతోటల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. తాగునీరు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. రైతులు, కూలీలు, పేద వర్గాలు బతుకలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు, బీడు భూములు ఎకరాకు రూ.20 వేలు చొప్పున పరిహారం అందించాలన్నారు. అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని, ఉపాధి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 రోజులు పనిదినాలు, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలన్నారు. కరువు భృతి కింద చేతివృత్తిదారులు, రైతులకు నెలకు రూ.10 వేల చొప్పున అందించాలన్నారు.
ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఫీల్డ్ అసిస్టెంట్లు
నార్పల : ప్రాదేశిక ఎన్నికల ప్రచారాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు చురుగ్గా పాల్గొంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలో 17 పంచాయతీలకు గాను 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల్ ఉన్నారు. పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. మండల పరిధిలోని హెచ్.సోదనపల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి చురుగ్గా పాల్గొన్నాడు. నిబంధనల మేరకు ప్రభుత్వ కొలువుల్లో కొనసాగేవారు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
ఎన్‌పీకుంట: మండల కేంద్రానికి చెందిన ఉప్పుతోళ్ల మల్లికార్జున (40) తెలంగాణ రాష్ట్రంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందా రు. వివరాలు... మల్లికార్జున డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఓ కారు కొనుగోలు చేశాడు. కారు అద్దెకు హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గద్వాల్ జిల్లా ధర్మవరం వద్ద ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొనింది. కారు నడుపుతున్న మల్లికార్జున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.


