అనంతపురం అర్బన్: మునిసిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కేటాయించిన అధికారులకు సంబంధించి రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఒ.ఆనంద్ చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీలో పోలింగ్ అధికారుల రెండవ దశ ర్యాండమైజేషన్‌ను కలెక్టర్‌తోపాటు ఎన్నికల సాధారణ, ఎక్స్‌పెండేచర్ పరిశీలకులు స్మరణ్‌రాజ్, సుబ్బరాజు పరిశీలించారు. ర్యాండమైజేషన్ తీరును ఎన్‌ఐసీ డీఐఓ భారతి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని గుత్తి, గుంతకల్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి మున్సిపాలిటీల పరిధిలో 689 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి సంబంధిత హెచ్‌ఓడీలు ఎంట్రీ చేసిన డేటా ప్రకారం అధికారుల హోదా ఆధారంగా ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు మొత్తం 4,960 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. అదే విధంగా 20 శాతం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామన్నారు. వీరికి శనివారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో శిక్షణ నిర్వహించి పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జిల్లా రిజిస్ట్రర్ ఆడిట్ భార్గవ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, గణాంకాధికారి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పరిశీలన
మున్సిపల్ ఎన్నికల విధుల్లో 4960 మంది
వివరాలు వెల్లడించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్


