రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Oct 23 2026 12:15 AM | Updated on Oct 23 2026 12:15 AM

● మరొకరికి తీవ్రగాయాలు..

గుత్తి రూరల్‌: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జక్కలచెరువు గ్రామానికి చెందిన సులోచన(32) బొమ్మనహాళ్‌ మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తన సోదరుడు మహేంద్ర, మేనకోడలు శ్రీలక్ష్మిలతో కలిసి సరుకుల కొనుగోలుకు గుత్తికి బయలుదేరారు. అయితే కొత్తపేట గ్రామ శివారులోని శ్రీకృష్ణ మందిరం వద్ద గుత్తి నుంచి తాడిపత్రి వైపునకు వెళ్తున్న నంద్యాల జిల్లా డోన్‌ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన రంగస్వామి ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో సులోచన, రంగస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి, మహేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సులోచన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. రంగస్వామిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ

అనంతపురం న్యూ టౌన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజూ గురువారం కొనసాగింది. గురువారం జిల్లాలోని 31 జెడ్పీటీసీ స్థానాలకు 92 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో వైఎస్సార్‌సీపీ తరఫున మొత్తం 41 మంది నామినేషన్లు వేశారు. ఇక జిల్లాలోని 450 ఎంపీటీసీ స్థానాలకుగాను రెండు రోజులుగా 1,199 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఇందులో 237 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులున్నారు. అయితే రాప్తాడు, తాడిపత్రి ఆత్మకూరు మండలాల్లో టీడీపీ నేతల అరాచకంగా కారణంగా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేన్లు దాఖలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement