పండుగకు వచ్చి.. పరలోకాలకు | - | Sakshi
Sakshi News home page

పండుగకు వచ్చి.. పరలోకాలకు

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

గార్లదిన్నె: దసరా పండుగకు సొంతూరుకు ఇల్లూరుకు వచ్చి, కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ చేసుకోవాలనుకున్న

అజయ్‌ (25)ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన ఇల్లూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన అజయ్‌ ( 25) మృతిచెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. ప్రయాణికుల ఆటో బుధవారం కల్లూరు నుంచి బయల్దేరి ఇల్లూరుకు వెళ్తోంది. తీరా ఇల్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌ వద్దకు వెళ్లగానే అదే సమయంలో వంశీ, సోమశేఖర్‌ అనే యువకులు ద్విచక్ర వాహనంపై కల్లూరుకు వెళ్తుండగా ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న రమీజా, భవ్యశ్రీ, రామాంజనమ్మ, వెంకటేష్‌, సుంకమ్మ, నరసక్క,అజయ్‌తో పాటు ద్విచక్ర వాహనదారులు వంశీ, సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement