గుంతకల్లులో టీడీపీకి రెబల్స్‌ బెడద | - | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో టీడీపీకి రెబల్స్‌ బెడద

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

● టికెట్‌ రాక స్వతంత్రులుగా బరిలోకి..

గుంతకల్లు: గుంతకల్లు టీడీపీలో రెబల్స్‌ బెడద అధికమైంది. ఇంతకాలం పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు టికెట్‌ వస్తుందని ఆశిస్తే.. చివరిరకు చుక్కెదురైంది. దీంతో తీవ్ర నిరాశతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆది నుంచి టిక్కెట్ల కేటాయింపులో పార్టీ నాయకత్వం నాన్చుడు ధోరణితో వ్యహరించిదన్న విమర్శలు వినింపించాయి. దీనికి తోడు బీజేపీ, జనసేన పార్టీల నుంచి కూడా టిక్కెట్లు కేటాయింపులో టీడీపీకి నిరసన వ్యక్తమయినట్లు తెలుస్తోంది. జెండా మోసిన వారిని పక్కకు పెట్టి భజనపరులకు టిక్కెట్లు ఇచ్చారని రెబల్‌ అభ్యర్థులు రగలిపోతున్నారు. టికెట్‌ దక్కని కొందరు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

పాత గుంతకల్లులో ఇదీ పరిస్థితి..

= పాత గుంతకల్లుకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు టీ కేశప్ప (6వ వార్డు) ఆవిర్భావరం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఉత్తమ కార్యకర్తగా అనేక సార్లు అవార్డులు అందుకున్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌తోపాటు ఆయన భార్య సుశీలమ్మ, సోదరుడు జయరాముడు, కోడలు సుమలత కౌన్సిలర్లుగా పని చేశారు. అయితే గుమ్మనూరు జయరాం బంధువు రమేష్‌కు 6వ వార్డు బీ–ఫాంను అందజేయడంతో తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశాడు. దీంతో పాత గుంతకల్లులోని 6వ వార్డుకు నేను (టీ కేశప్ప), 5వ వార్డుకు సుమలత (కోడలు), 11వ వార్డుకు మా అన్న జయరాముడును రెబల్‌ అభ్యర్థులుగా చంద్రబాబు, లోకేష్‌ ఫొటోలతో బరిలో దిగినట్లు విలేకరులకు చెప్పారు. 6 వార్డుకు చెందిన మరో టీడీపీ నాయకుడు శేఖర్‌ కూడా టికెట్‌ అశించాడు. పార్టీ కోసం రూ.లక్షలు ఖర్చు చేసి మోసిపోయినట్లు వాపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్‌ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆయను కూడా రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అదేవిధంగా 41వ వార్డుకు చెందిన మరో సీనియర్‌ నాయకుడు రామచంద్రయ్య పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డాడు. ఇక జనసేన, బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తలను, రెబల్స్‌ను బుజ్జగించడానికి టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement