పండుగ పూట విషాదం | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం

Oct 22 2026 12:45 AM | Updated on Oct 22 2026 12:45 AM

యల్లనూరు: మండలం కల్లూరులో దసరా పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో వినయ్‌కుమార్‌ (17) మృతి చెందాడు. కరెంటు రూపంలో మృత్యువు యువకుడి ప్రాణాలు బలిగొన్న ఘటన కల్లూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కల్లూరు గ్రామానికి చెందిన లింగయుతుల మల్లికార్జున చిన్న కుమారుడు వినయ్‌కుమార్‌ పండుగరోజు ఇంటికి తాగునీరు పట్టుకునేందుకు మోటారు ఆన్‌ చేశాడు. అయితే మోటారుకు ఉన్న వైరు అర్త్‌ తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై, అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగరోజు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో కరెంటుషాక్‌తో ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

రాయదుర్గం రూరల్‌: దసరా పండుగ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్లేపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం, చిత్రదుర్గం జిల్లా జీరిపల్లికి చెందిన బోయ శివన్న (33) దసరా పండుగ కోసం ఈనెల 18న పల్లేపల్లిలోని అత్తారింటికి వచ్చాడు. తాగుడుకు బానిసైన అతను.. భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈనెల 20న గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య మీనాక్షి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement