● పోలీసులకు ఎస్పీ జగదీష్ ఆదేశం
యల్లనూరు: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని, సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. మంగళవారం యల్లనూరు, పుట్లూరు మండలాల్లో జిల్లా ఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లి, కోమటికుంట్లలో ఆయన పర్యటించారు. ఏఎస్పీ అశ్విన్ మణిదీప్, పుట్లూరు సీఐ వంశీకృష్ణ , ఎస్‌ఐలు రామాంజనేయరెడ్డి, సురేంద్రబాబు, ధరణీబాబు పాల్గొన్నారు.
నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి
ఆత్మకూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరులో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణాన్ని ఎస్పీ పరిశీలించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ హేమంత్‌కుమార్, ఎస్‌ఐ లక్ష్మణరావు, ఎంపీడీఓ నాగకృష్ణయ్య, పోలీస్‌లు పాల్గొన్నారు.


