పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

Oct 22 2026 12:33 AM | Updated on Oct 22 2026 12:33 AM

● అనంతపురం రేంజ్‌ ఐజీ షిమోషి

అనంతపురం సెంట్రల్‌: సమాజ రక్షణకోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని అనంతపురం రేంజ్‌ ఐజీ షిమోషి అన్నారు. బుధవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ జగదీష్‌తో కలిసి నివాళులర్పించారు. ఐజీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ మాట్లాడుతూ పోలీసుశాఖలో కారుణ్య నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ సమన్వయంగా రాబోవు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ జగదీష్‌ మాట్లాడుతూ ఈనెల 31 వరకూ అమరవీరుల వారోత్సవాలు జరుపుకోనున్నట్లు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయేష్‌కుమార్‌, అదనపు ఎస్పీలు నాగభూషణం, ఇలియాస్‌బాషా, అనంతపురం రూరల్‌ ఏఎస్పీ అశ్విన్‌ మణిదీప్‌, డీఎస్పీ కరుణాకర్‌రావు, డీపీఓ, ఏఆర్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కసాపురంలో

వైభవంగా గ్రామోత్సవం

గుంతకల్లు రూరల్‌: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలంకరణలో తీర్చిదిద్దిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామిని గజవాహనంపై కొలువుదీర్చి ఆలయ ఈవో విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement