పరిషత్‌ నామినేషన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ నామినేషన్లు ప్రారంభం

Oct 22 2026 12:33 AM | Updated on Oct 22 2026 12:33 AM

● తొలిరోజు 16 జెడ్పీటీసీ నామినేషన్లు

● 180 ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు

అనంతపురం న్యూ టౌన్‌: జిల్లా పరిషత్‌లో బుధవారం 31 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటీసును జిల్లా రిటర్నింగ్‌ అధికారి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తన చాంబర్‌లో జారీ చేశారు. ఈనెల 23 సాయంత్రం ఐదు గంటల వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ నెల 27 లోపు నామినేషన్ల మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందని, నవంబర్‌ మూడో తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు ఉంటాయన్నారు. 5వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని అనంతరం ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని చెప్పారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల శాంతియుత ప్రక్రియకు సహకరించాలని కోరారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 16 జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 450 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో తొలిరోజు 180 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు.

ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం

స్థానిక ఎన్నికల్లో ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటే, స్థానిక పోలీసుల ద్వారా వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ పేర్కొన్నారు. స్క్రూటినీ సమయంలో అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. జిల్లా పరిషత్‌లో జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించి, అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. అంతకుముందు ఎస్పీ జగదీష్‌ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను, భద్రతను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement