● గుంతకల్లు నియోజకవర్గంలో బరితెగించిన ఎమ్మెల్యే అనుచరులు
పామిడి: ఎంపీటీసీ నామినేషన్ల తొలిరోజే టీడీపీ గూండాలు కత్తులతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడిచేసి గాయపరిచారు. బుధవారం పామిడి ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోకి గుంతకల్లు ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో పాటు స్థానికేతరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయినా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించలేదు. పామిడి ఎంపీటీసీ–6 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లికి చెందిన డ్రైవర్ రమేష్‌కు టీడీపీ నేతలతో పాటు స్థానికేతరులు ఫోన్ చేసి.. ‘ఎన్నికల్లో పోటీచేస్తే నీ కాళ్లు చేతులు విరుస్తాం’ అని బెదిరించారు. అయినా రమేష్ వారి మాటలను ఖాతరు చేయలేదు. పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెండింగ్ ఉన్న ఇంటి గుత్త చెల్లించేందుకని వైఎస్సార్‌సీపీకి చెందిన కత్రిమల రమేష్, కొండూరు బబ్లూ తమ్ముడు రమేష్‌తో కలిసి అభ్యర్థి డ్రైవర్ రమేష్ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. సమాచారం అందుకున్న టీడీపీ గూండాలు కత్తులు, రాడ్లతో చేరుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కత్రిమల రమేష్ ఎడమచేతి, బబ్లూ తమ్ముడు రమేష్‌కు కన్ను, కణతిపై గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు.


