అనంతపురం: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ బుధవారం ప్రశాంతంగా పూర్తయింది. ఉపసంహరణల అనంతరం అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి 12 మంది, 62 డివిజన్లకు 197 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాయదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఆరుగురు, 40 వార్డులకు 107 మంది పోటీలో మిగిలారు. గుంతకల్లులో చైర్‌పర్సన్‌కు నలుగురు, 48 కౌన్సిలర్ స్థానాలకు 189 మంది బరిలో ఉన్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి ముగ్గురు పోటీలో నిలిచారు. ఇక తాడిపత్రి, గుత్తి మున్సిపల్ స్థానాలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈ నెల 25న బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.


