శతమానంభవతి | - | Sakshi
Sakshi News home page

శతమానంభవతి

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

బెళుగుప్ప: కాలువపల్లిలో నివసిస్తున్న పూలకుంట పార్వతమ్మ తన వందో జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా చేసుకున్నారు. ఈసందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేశారు. పార్వతమ్మ, దివంగత గోవిందరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీనివాసరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఐదుగురు కుమార్తెలు సరోజమ్మ, కమలమ్మ, సునందమ్మ, సావిత్రమ్మ, కిష్టమ్మ ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు సరోజమ్మ అధ్యాపకురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. వంద జన్మదినాలు జరుపుకున్న పార్వతమ్మ ఎలాంటి దీర్ఘకాల జబ్బులు లేకుండా తన పనులు తానే చేసుకుంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు పేర్కొంటున్నారు.

కవితా సంపుటాల ఆహ్వానం

అనంతపురం కల్చరల్‌: ప్రతిష్టాత్మకంగా అందించే ‘ఉమ్మడిశెట్టి అవార్డు కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకుడు, సీనియర్‌ కవి డాక్టర్‌ రాధేయ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026లో ప్రచురింపబడిన కవితా సంపుటాలలో ఉత్తమవైనవిగా నిలిచే వాటికి రూ.6 వేలు నగదు బహుమతి, కవికి ఘనంగా సత్కారం ఉంటాయని పేర్కొన్నారు. రచనలు ‘డాక్టర్‌ ఉమ్మడిశెట్టి రాధేయ, చైర్మన్‌, లిటరరీ ట్రస్టు, 13–1–606–1, షిర్డీనగర్‌, రెవెన్యూ కాలనీ, అనంతపురం’ చిరునామాలో చేరేలా పంపాలని, వివరాలకు 9985171411 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

విద్యార్థిని ఆత్మహత్య

కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): మండలంలోని న్యామద్దల గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థిని ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి అరుణ, మంజునాథ్‌ దంపతుల కుమార్తె అమూల్య (19) అనంతపురంలో బీటెక్‌ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేసుకొంటూ కాలక్షేపం చేస్తుండగా తల్లి చూచి మందలించింది. మనస్థాపానికి గురైన ఆమె వారి ఇంటి సమీపంలో గడ్డివాము దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

కుక్కను తప్పించబోయి..

● బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

బ్రహ్మసముద్రం: కుక్కను తప్పించబోయి అదుపు తప్పి బైక్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు..ఎరడికెర గ్రామానికి చెందిన గొల్ల గోవిందప్ప(42) ఆదివారం తెల్లవారు జామున బైక్‌పై గంగమ్మ వంక వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. బ్రహ్మసముద్రం క్రాస్‌ వద్ద ఆకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

తాడిమర్రి: ఏకపాదంపల్లిలో ఆదివారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తలారి సాకే రామన్న (65) తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో ఎకరాలో వేరుశనగ, అర ఎకరాలో చీనీ చెట్లను సాగు చేశాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పంటకు నీరు పెట్టడానికి మోటర్‌ ఆన్‌ చేసి వేరుశనగ పంటలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభం నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు చెట్టు మీద లాగిన విద్యుత్‌ తీగ రైతు మీద పడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement