నిష్పక్షపాత ఎన్నికలకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాత ఎన్నికలకు సహకరించండి

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

అనంతపురం న్యూ టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు బచ్చు స్మరణ్‌రాజ్‌ కోరారు. ఆదివారం జిల్లా పరిషత్‌లోని సీఈఓ ఛాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీలకు జిల్లా పరిషత్‌లో, ఎంపీటీసీలకు సంబంధించి ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో తగిన సమాచారాన్ని అందిస్తామన్నారు. అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ సోమవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రధాన శిక్షకులు అయిన గోవిందరాజులు నోటిఫికేషన్‌ మొదలు ఎన్నికలు ముగిసే వరకూ పాటించాల్సిన నిబంధనలు వివరించారు. ఈసందర్భంగా వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలిచ్చారు. వైఎస్సార్‌ సీపీ నుంచి సి.సోమశేఖర్‌రెడ్డి, వై అమర్‌నాఽథ్‌రెడ్డి, సీపీఎం ఎం బాల రంగయ్య, టి రామాంజనేయులు, బీఎస్పీ కుళ్లాయప్ప, జిలాన్‌ బాషా, హరిప్రసాద్‌, టీడీపీ నారాయణ స్వామి, ఆమ్‌ ఆద్మీ మసూద్‌ వలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement