ఓటమి భయంతోనే దౌర్జన్య కాండ | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే దౌర్జన్య కాండ

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబు ప్రభుత్వం దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతోందని ఎమ్మెల్సీ మంగమ్మ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన తొలి రోజే టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి జీర్ణించుకోలేక ఎలాగైనా గెలవాలనే దురాలోచనతో అధికార పార్టీ నేతలు అరాచకాలకు తెరలేపారని మండిపడ్డారు. రాయచోటి, పుంగనూరు, ధర్మవరం నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో నామినేషన్‌ వేసే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిపై రాళ్ల దాడులు చేయడం, ఆయన భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యాలయాల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారంటే చంద్రబాబు సర్కార్‌ ఎంతటి దారుణాలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి లోకేష్‌ ’రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అరాచక కూటమి ప్రభుత్వానికి ప్రజలే ఓటుతో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement