అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ వైఎస్ఆర్టీఏ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్ కుమార్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని ఆ సంఘం అనంతపురం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అయ్యుబ్ హుస్సేన్‌కు శనివారం వినతిపత్రం అందజేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం అందజేసేందుకు అశోక్ కుమార్ రెడ్డి ప్రయత్నించారని సంఘం ప్రతినిధులు తెలిపారు. అయితే ఆయన డీఎస్సీకి సంబంధించి వినతిపత్రం ఇచ్చినట్లు భావించి సస్పెండ్ చేయడం అన్యాయమని నేతలు అన్నారు. ఈ విషయంలో వాస్తవాలను డీఈఓకు వివరించి, సస్పెన్షన్ నిర్ణయాన్ని పునఃపరిశీలించి వెంటనే ఎత్తేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోవిందరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణప్ప, విశ్వనాథరెడ్డి, రవీంద్రారెడ్డి ఉన్నారు.


