మామిడిలో ప్రకృతి సేద్యం భేష్‌ | - | Sakshi
Sakshi News home page

మామిడిలో ప్రకృతి సేద్యం భేష్‌

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

● జల్లిపల్లిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన రాష్ట్రస్థాయి అధికారుల బృందం

కూడేరు/అనంతపురం అగ్రికల్చర్‌: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండ్ల తోటలు సాగు చేపడితే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాక అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌పీఎంయూ) అధికారులు అన్నారు. శుక్రవారం జిల్లా అధికారి లక్ష్మానాయక్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అధికారుల బృందం మండలంలోని జల్లిపల్లిలో రైతు ఆదినారాయణ సాగు చేసిన మామిడి తోటను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పంట సాగులో రైతు అవలంబించిన విధానాలపై వారు ఆరా తీశారు. పంట సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చులు, మొక్కల పెరుగుదల, దిగుబడి, పంట నాణ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సేద్యంతో భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని బృందం అధికారులు రైతులకు సూచించారు. అనంతరం గార్లదిన్నె మండలం కోటంకలో 150 ఎకరాల్లో ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసిన 35 ఎకరాల కాంటాక్టు బ్లాక్‌ను సందర్శించారు. అక్కడ రైతు మనోహర్‌ అనుభవాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌పీఎం డాక్టర్‌ నవీన్‌, కన్సల్టెంట్‌ రాజా, డీపీఎంయూ వైపీ గణేష్‌, కమ్యూనికేషన్‌ కీర్తన పాల్గొన్నారు.

మొబైల్‌ పేలడంతో ఇంట్లో మంటలు

కంబదూరు(కళ్యాణదుర్గం రూరల్‌): చార్జీంగ్‌ పెట్టిన సమయంలో సెల్‌ఫోన్‌ పేలిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని ఓబుగానిపల్లి గ్రామంలో జరిగింది. దివ్యాంగురాలు కావ్య ఇంట్లో ప్రమాదం చోటు చేసుకోగా, మంటలు ఇళ్లంత వ్యాప్తించడంతో ఫ్రిడ్జ్‌, బట్టలు, ఇతర నిత్యవసర వస్తువులు దగ్ధమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement