బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

● మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా హీరాపురం ఫయాజ్‌బాషా

● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రిటౌన్‌: తాడిపత్రిలో తమ పార్టీ తరఫున నామినేషన్‌లు వేసే అభ్యర్థులను టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి , ఆయన అనుచరులు బెదిరిస్తున్నారన్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మైనార్టీ నేత ఫయాజ్‌బాషాను బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక తమ పార్టీ అంతర్గత నిర్ణయమని పేర్కొన్నారు. ఇతరులు చెప్పినంతమాత్రాన పార్టీ నిర్ణయాలు మారబోవని స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన పార్టీ తరఫున నామినేషన్‌ వేసే హక్కు ఉందన్నారు. అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌కు కేటాయించి ఉంటే తమ కుటుంబం, జేసీ కుటుంబం అని చర్చ జరిగిందని, దానికి తగ్గట్టుగానే కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిని సిద్ధం చేశానని వెల్లడించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్‌తో పరిస్థితులు మారాయన్నారు. తనను తాడిపత్రికి రాకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా తాడిపత్రికి రాకుండా ఆపలేకపోయాడన్నారు. తాడిపత్రిలో మట్కా, గంజాయి బ్యాచ్‌లతో అమాయకులపై దాడులు చేయిస్తున్నాడన్నారు. తనను బెదిరించినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement