● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త రంగయ్య వెల్లడి
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షిణి పోటీ చేస్తారని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడుతో కలిసి అభ్యర్థి పేరును ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని నేతలు సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరప్ప, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గోళ్ల సూరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కంబదూరు అబ్జర్వర్ దొడగట్ట నారాయణ, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తలారి సత్తి, నాయకులు భట్టువానిపల్లి అంజి, భీమేష్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, గాజుల అంజి, షేక్షావలి, పోలార్పు నరేష్, లీగల్ సెల్ తాలూకా అధ్యక్షుడు రామాంజనేయులు, దాదా ఖలందర్, మంజు, జానీ పాల్గొన్నారు.


