శింగనమల: పెరవలి వద్దనున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన సెంట్రింగ్ షీట్లను అపహరిస్తుండగా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ప్రసాద్ గురువారం తెలిపారు. సెంట్రింగ్ షీట్లను దొంగలిస్తున్న విషయాన్ని రాత్రి వేళలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గమనించి పట్టుకొని విచారించారన్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు విలువ చేసే సెంట్రింగ్ షీట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాలు, గోదాముల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


