వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలు

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని సచివాలయం దగ్గర వెలసిన పెద్దమ్మ తల్లికి మంగళవారం గ్రామస్తులు 8వ బోనాల వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయ ప్రాగంణం అంతా భక్తులతో కిక్కిరిపోయింది. దీంతో ఉరుముల వారు చేసిన శబ్దాలతో ఆలయ ప్రాంగణం అంతా మార్మోగింది. మండల కేంద్రంలోని ప్రతి ఇంటి నుంచి సంప్రదాయ బద్ధంగా మహిళలు బోనాన్ని ఎత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ముసలమ్మ దేవత వంశస్థులు సూర్య నారాయణరెడ్డి, సుశీలమ్మ గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా సుఖ శాంతులు ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సుబ్బరాయుడు ఆద్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement