కూడేరు: ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రతి రంగంలోనూ నైపుణ్యం సంపాదించుకోవాలని ఎన్‌సీసీ క్యాంప్ కమాండర్ కల్నల్ అమిత్ గంగ్వార్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్‌సీసీ నగర్‌లో సీఏటీసీ–14వ ఎన్‌సీసీ శిక్షణ ఇస్తున్నారు. సోమవారం క్యాడెట్లకు సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్యాడెట్లకు భరతమాత, దేశభక్తి గీతాలకు క్యాడెట్లు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం క్యాంప్ కమాండర్ మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండర్ మేజర్ అరుణ్, ఎన్‌సీసీ అధికారులు శ్రీనివాస్, విజయ కుమార్, రవి కుమార్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
రూ.20.66 కోట్లతో
యాంత్రీకరణ
అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుత 2026–27కు సంబంఽధించి రూ.20.66 కోట్ల బడ్జెట్‌తో యాంత్రీకరణ పథకం అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కమ్యూనిటీ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) గ్రూపులకు రూ.15.50 కోట్లు, వ్యక్తిగత పరికరాలకు రూ.5.16 కోట్లు కేటాయించామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిశ నిర్దేశం చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత పరికరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సన్న చిన్నకారు, మైనార్టీ రైతులకు 50 శాతం, మిగతా వర్గాలు, అలాగే సీహెచ్‌సీ గ్రూపుల కింద 40 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. సీహెచ్‌సీ గ్రూపులకు రూ.10 లక్షల విలువైన యంత్ర పరికరాలకు బ్యాంకు రుణాలు అవసరం లేదన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన యంత్రపరికరాలు అవసరమైతే బ్యాంకు రుణం తప్పనిసరి అన్నారు. మండల వ్యవసాయశాఖ, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లను సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని సిద్దరాంపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని నందిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని హెచ్‌ఎం నీరజ, పీడీ నాగరాజు సోమవారం తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో సిద్దరాంపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని నందిని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవరంబర్ 5 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో నందిని పాల్గొంటుందన్నారు. నందినిని హెచ్‌ఎం నీరజ, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటప్ప, బాలకృష్ణ, ఆదినారాయణ, గోపమ్మ, కమల, ఉమా, వెంకటలక్ష్మి, లీల, సువర్ణ, షబ్బీర్ అభినందించారు.
వసతిగృహాల
నిర్వహణపై ప్రత్యేక దృష్టి
అనంతపురం ఎడ్యుకేషన్: సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరమ్మ చైల్డ్ కేర్ లీవ్‌లో వెళ్లడంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావుకు ఆ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజేశ్వరమ్మ ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు సెలవులో ఉండనున్నారు. ఆమె 2027 జనవరి 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం, హాస్టళ్లలో నిర్వహణ ప్రమాణాలను పర్యవేక్షించడం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంపై దృష్టి పెడతామన్నారు.


