పెద్దవడుగూరు మండలంలో మిర్చి రైతులకు కష్టాలు రోజు రోజుకూ కంటతడి పెట్టిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో మండలంలో ఎక్కువ శాతం మంది రైతులు మిర్చి, పత్తి పంటలను సాగు చేశారు. సుమారుగా 60 నుంచి 80 శాతం వరకు పంటలు సాగు చేశారు. రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. తొలుత తొలకరి జల్లులు రైతులకు ఆశపెట్టి.. రానూరానూ ఆవిరిచేశాయి.. వర్షాలు కురవక బోరుబావుల్లోనూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పత్తి రైతులు పంటపై ఆశలు వదులుకున్నా..మిర్చి పంటను కాపాడుకోవడానికి క‘న్నీటి’ తడులు ఇవ్వాల్సి వస్తోంది. పెద్దవడుగూరుకు చెందిన రైతు తలారి రామాంజనేయులు రెండెకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. పంటకు పెట్టుబడిగా సుమారుగా ఎకరానికి రూ.60వేల దాకా ఖర్చు చేశాడు. పంట ఎండిపోతుండడంతో చేసేదేమీలేక పెద్దవంక నుంచి నీటిని ట్యాంకర్లతో నింపుకొని తడులు ఇస్తున్నాడు. ఈయన ఒక్కరే కాదు.. ఇలా ఎందరో రైతులు పంటలను కాపాడుకోలేక, నీటి తడులు ఇవ్వలేక దిక్కుతోచని స్థితిలో పడి ఉన్నారు. – పెద్దవడుగూరు
నీటి ట్యాంకరుతో మిర్చి పంటకు నీళ్లు పెడుతున్న దృశ్యం
పెద్దవంకలోని నీటిని ట్యాంకరుకు నింపుకుంటున్న దృశ్యం


