చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం అర్బన్‌: కరువు బారిన పడిన రైతులను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రైతులు కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటే చంద్రబాబుకు మాత్రం కనిపించడంలేదని మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో కరువు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకోవాలని నాయకులు, రైతులు ఎండిన పండ చెట్లు, పంటలతో నిర్వహించిన ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. కరువు మండలాల ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వం సరిపెట్టిందే తప్ప కరువు సహాయక చర్యలు చేపట్టేందుకు నిధులు ఇవ్వకపోవడం రైతులు, ప్రజలను నిర్లక్ష్యం చేయడమే అన్నారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కరువు, కరువు సహాయక చర్యలకు అవసరమైన నిధుల మంజూరుపై కాకుండా నదుల అనుసంధానం అంశంపై కేంద్రంతో మాట్లాడారన్నారు. ఎల్‌నీనో ప్రభావం రాష్ట్రంపై అధికంగా ఉందని తాము బాగా పనిచేస్తున్నామని చెప్పడం చూస్తే కరువును ఆయన తేలిగ్గా తీసుకున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. అనంతరం రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా కార్యదర్శివర్గ, కార్యవర్గ సభ్యులు నాగేంద్రకుమార్‌, రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, బాలరంగయ్య, భాస్కర్‌, వెంకటనారాయణ, ముత్తుజ, రామాంజనేయులు, జగన్‌మోహన్‌రెడ్డి, పండ్లతోటల సంఘం నాయకులు శివారెడ్డి, సుర్యచంద్రారెడ్డి, సూరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement