ఆత్మకూరు పోలీసులపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆత్మకూరు పోలీసులపై చర్యలు తీసుకోండి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

అనంతపురం సెంట్రల్‌: సమస్యలపై పోలీసుస్టేషన్‌కు వెల్లిన దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడిన ఆత్మకూరు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు వసంతకుమార్‌, రామయ్య తదితరులు డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్లకు చెందిన దివ్యాంగుడు రామంజనేయులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆత్మాభిమానం దెబ్బ తినేలా వ్యవహరించారని తెలిపారు. సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 130 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి ఎస్పీ జగదీష్‌ అర్జీలను స్వీకరించారు. బాధితులకు చట్ట పరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఎస్‌ఐ మోసం.. : రైల్వేలో గ్రూప్‌ డి ఉద్యోగం ఇప్పిస్తానని ఎస్‌ఐ మధుసూదన్‌నాయడు మోసం చేశాడని రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. కుందిర్పి మండలం అప్పిలేపల్లికి చెందిన ఎస్‌ఐ మధుసూదన్‌నాయుడు ఆదోనిలో పనిచేస్తున్నాని చెప్పి..తన కుమారుడికి ఉద్యోగి ఇప్పిస్తానని రూ. 6 లక్షలు ఇప్పించుకున్నాడని తెలిపారు. విచారించి తనకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement