ఆ ఖాకీలు.. కుర్చీలు వదలరూ! | - | Sakshi
Sakshi News home page

ఆ ఖాకీలు.. కుర్చీలు వదలరూ!

Oct 8 2026 12:36 AM | Updated on Oct 8 2026 12:36 AM

అనంతపురం సెంట్రల్‌: జిల్లా పోలీసు బాసు కనుసన్నల్లో పని చేసే ఎస్‌ఓజీ(స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌), స్పెషల్‌ బ్రాంచ్‌, సీసీఎస్‌(సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌)లు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల విషయంలో చాలా కీలకం. దొంగతనాలకు పాల్పడే వారు, అనుమానితులపై నిరంతరం ఆయా విభాగాలు నిఘా ఉంచి నేరాలను కట్టడి చేస్తాయి. అయితే ఇటీవల నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వరుస చైన్‌ స్నాచింగ్‌లు, చోరీ ఘటనలు ఆయా విభాగాల వైఫల్యం వల్లే చోటు చేసుకుంటున్నాయని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. మూడు విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది నిర్వాకంతోనే నేరాలు అడ్డూఅదుపు లేకుండా పోతున్నాయని విమర్శలున్నాయి.

ఏళ్లుగా ఆ విభాగంలోనే

ఎస్‌ఓజీ విభాగంలో ఓ కానిస్టేబుల్‌ పదేళ్లుగా పని చేస్తున్నారు. అంతకుముందు ఆయన సీసీఎస్‌లో ఐదేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన సర్వీసు మొత్తం అనంతపురంలోనే గడిచిపోతోంది. పాతూరులో ఉంటున్న ఆయన వడ్డీ వ్యాపారులతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలానే స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ అధికారి అదే విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, చివరకు ఎస్‌ఐ స్థాయికి చేరుకున్నారు. పైస్థాయి అధికారులను ప్రసన్నం చేసుకోవడంతోనే ఆయన ఆ విభాగంలో కొనసాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నేరస్తులతో అంటకాగుతూ..

మామూళ్లు తీసుకుంటూ..

కీలక విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఆయా పోలీసుస్టేషన్‌ పరిధిలోని నేరస్తులతో ఎక్కువ పరిచయాలు ఏర్పరుచుకుంటున్నారు. గతంలో తాడిపత్రిలో మట్కా నిర్వాహకులతో ఎస్‌ఓజీలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు నెలనెలా మామూళ్లు తీసుకున్న వ్యవహరం బయటపడింది. అలాగే ఈ ప్రభుత్వ హయాంలో రాప్తాడు మండలంలో జరిగిన డబుల్‌ మర్డర్‌ కేసులోని నిందితులతో కలిసి కొంతమంది కానిస్టేబుళ్లు రాప్తాడు సమీపంలోని ఓ ధాబాలో పార్టీ చేసుకున్నారని ఆ శాఖాధికారులకు సమాచారం అందడంతో అంతర్గత విచారణ చేసినా చర్యలకు ఉపక్రమించలేదు. జిల్లాలో వరుస చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు, చోరీలు జరుగుతున్నా కీలక విభాగాల్లోని సిబ్బంది ఏం చేస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వారు తప్ప ఆయా విభాగాలకు ఎవరూ లేరా..? మేము పనికిరామా అనే అభిప్రాయం కూడా నిజాయితీగా పనిచేస్తున్న పోలీసు సిబ్బంది నుంచి వస్తోంది. ఏది ఏమైనా నిఘా వ్యవస్థల్లో ప్రక్షాళన జరగకపోతే జిల్లాలో శాంతిభద్రతలు అదుపుతప్పే అవకాశముందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

క్యాలెండర్లు మారుతున్నా కీలక విభాగాల్లో తిష్ట వేసిన సిబ్బంది

శాంతిభద్రత ల పరిరక్షణలో ఎస్‌ఓజీ, స్పెషల్‌ బ్రాంచ్‌, సీసీఎస్‌లే ప్రధానం

ఆయా విభాగాల వైఫల్యం కారణంగానే వరుస నేరాలు

నేరస్తులతో అంటకాగుతున్నా పట్టించుకోని పోలీసు బాస్‌

ప్రక్షాళన జరగకుంటే జిల్లాలో శాంతిభద్రతలు అధోగతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement