కాపర్‌ వైరు దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కాపర్‌ వైరు దొంగల అరెస్టు

Oct 8 2026 12:36 AM | Updated on Oct 8 2026 12:36 AM

కళ్యాణదుర్గం: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్లను దొంగలిస్తూ వాటిని గుజిరి వ్యాపారస్తులకు విక్రయిస్తున్న దొంగలను బ్రహ్మసముద్రం పోలీసులు పట్టుకున్నట్టు కళ్యాణదుర్గం డీఎస్పీ దైవ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్‌ సర్కిల్‌ సీఐ నీలకంఠేశ్వర, పట్టణ సీఐ హరినాథ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మసముద్రం మండలంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ట్రాన్స్‌ఫార్మర్లు, పంపు సెట్లు, గాలిమరల వద్ద కేబుల్‌ వైర్లను ముఠా సభ్యులు దొంగలించినట్టు గుర్తించామన్నారు. పట్టుబడిన నిందితులు కంబదూరు మండలం అండేపల్లికి చెందిన జి.శబరీష్‌ అలియాస్‌ గొల్ల శబరి, మందుల మారుతి అలియాస్‌ మారుతిలను అదుపులోకి తీసుకుని విచారించగా వీరితో పాటు మరో ఆరుగురు ముఠా సభ్యులుగా ఉన్నట్టు తెలిపారన్నారు. ఎరుకుల సురేంద్ర ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యులు ముఠాగా ఏర్పడి దొంగతనాలను పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వీరు గత రెండేళ్లలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వాటిని పగులగొట్టి కాపర్‌ వైర్లను దొంగలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. దొంగలించిన కాపర్‌ వైర్లను కొంత మేర విక్రయించి మిగిలిన వైర్లను బ్రహ్మసముద్రం మండలంలోని ముప్పులకుంట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాచిపెట్టినట్టు నిందితులు వివరించారన్నారు. అటవీ ప్రాంతంలో దాచివుంచిన సుమారు 410 కిలోల కాపర్‌ వైరుతోపాటు ఓ పల్సర్‌ బైకు (కేఏ53 హెచ్‌ 5432)ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం 28 కేసులలో 30 ట్రాన్స్‌ఫార్మర్లను, మూడు చోట్ల మోటార్‌ పంపుసెట్లు/కాపర్‌ కేబుల్‌, గాలిమర్ల వద్ద కేబుల్‌ దొంగతనాలను చేసినట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన ఇద్దరితో పాటు మరో ఆరుగురు కంబదూరు మండలం అండేపల్లికి చెందిన మందల హనుమంతు, మందల సారప్ప అలియాస్‌ సోము, ఎరికల సురేంద్ర, ఎరికల నగేష్‌, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గొల్ల రవి అలియాస్‌ దాసరి రవి, అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటకు చెందిన మైలగాని శివకేశవ అలియాస్‌ కేశవలు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలియజేశారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్టు ఆయన స్పష్టం చేశారు. దొంగల ముఠాను అరెస్టు చేయడానికి కృషి చేసిన రూరల్‌ సర్కిల్‌ సీఐ నీలకంఠేశ్వర, బ్రహ్మసముద్రం ఎస్‌ఐ సాయి కుమార్‌, కంబదూరు ఎస్‌ఐ లోకేష్‌, ఏఎస్‌ఐ గంగాధర్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు బాషా, భవాని ప్రసాద్‌, కానిస్టేబుళ్లు ఖాజా, రాజేష్‌, గుడదప్ప, అనీల్‌, శివప్పలను కళ్యాణదుర్గం డీఎస్పీ దైవ ప్రసాద్‌ అభినందించారు.

410 కిలోల కాపర్‌ వైరు, బైకు స్వాధీనం

ఇద్దరు నిందితుల అరెస్టు, మరో ఆరుగురు పరారీ

వివరాలు వెల్లడించిన కళ్యాణదుర్గం డీఎస్పీ దైవ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement