ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

అనంతపురం అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, ఎస్పీ జగదీష్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు అన్యాయానికి గురికాకుండా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పర్యవేక్షించాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసులతో పాటు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎస్సీ సూచించారు. డప్పు కళాకారులకు ఇస్తున్న విధంగా ఉరుముల కళాకారులకు పింఛను మంజూరు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. నెలలో ఒక రోజు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించాలన్నారు. కొన్ని చోట్ల ఎస్సీలను ఆలయాల్లోకి రానీయడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ మహిళలు అత్యాచారానికి గురైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement