పంటలు ఎండిపోతున్నా పట్టదా? | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండిపోతున్నా పట్టదా?

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంత, పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌ ధ్వజం

అనంతపురం: సాగునీరందక పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ కుప్పంకు నీటిని తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. నేరుగా కుప్పంకు నీటి తరలింపు కారణంగా అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల్లోని పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే హంద్రీ–నీవా కాలువకు, పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సబ్సిడీ కింద రైతులకు విత్తనాలు వెంటనే చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు నిర్వహించడంతో పాటు త్వరలోనే కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా అమలు చేసే వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ప్రతి స్థానంలో గెలుపు గుర్రాలను, ప్రజాదరణ ఉన్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని అనంత ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిష్పక్షపాతంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయా లని సూచించారు. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య, రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె లింగబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement